MDK: ధాన్యం కొనుగోళ్లలో కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నిన్న సాయంత్రం నర్సాపూర్ మార్కెట్ యార్డులో కొనుగోలు పరిశీలించారు. జిల్లాలో 57,051 మంది రైతుల నుంచి 2,14,856.640 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ 347.56 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. 5008 రైతులకు సన్నధాన్యం బోనస్ రూ 11.56 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు.