HYD: యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగిలో ఈ నెల 23 నుంచి నిన్నటి వరకు జరిగిన రాష్ట్రస్థాయి SGF అండర్-17 ఖోఖో పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలబాలికల జట్లు విజయకేతనం ఎగురవేశాయి. ఫైనల్స్లో మొదటిస్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించాయి. ఉమ్మడి జిల్లా జట్లను ఖోఖో సంఘం సభ్యులు, జిల్లా SGF సెక్రటరీలు అభినందించారు.