SRPT: పాలేరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మోతే మండలం అన్నారుగూడెం గ్రామంలో నిన్న మధ్యాహ్నం గ్రామసభ నిర్వహించారు. లిఫ్ట్ ఇరిగేషన్లో భూములు కోల్పోతున్న రైతుల నుంచి వారి అభిప్రాయాలను, సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవరావు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మోతే తహసీల్దార్ వెంకన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.