GNTR: మేడికొండూరు మండలం పేరేచెర్ల గ్రామంలోని సీసీఐ (CCI) పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సందర్శించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్తో కలిసి ఆయన కేంద్రంలోని పత్తి కొనుగోలు ప్రక్రియను, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానిక పత్తి రైతులతో మంత్రి ముచ్చటించారు.