ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ ఎస్.ఎస్రావు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మండలంలోని చింతలపాలెం, గొట్టమిల్లు, హజరత్ గూడెం గ్రామాల్లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.