ELR: ఉంగుటూరు మండలంలో CM చంద్రబాబు డిసెంబర్ 1న పర్యటించనున్నారని జిల్లా అధికారులు తెలిపారు. సామాజిక పెన్షన్ పంపిణీ, బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందన్నారు. దీనితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. CM పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి, MLA ధర్మరాజు, అప్కాబ్ ఛైర్మన్ వీరాంజనేయులుతో మంగళవారం పరిశీలించారు.