మన్యం జిల్లాలో చేపడుతున్న ఆసుపత్రుల నిర్మాణాలన్నీ యుద్ధ ప్రాతిపదికన పూ ర్తిచేయాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఆసుపత్రుల నిర్మాణ పురోగతిపై ఆయన చర్చించారు.