TG: తాగునీటితో బెంజ్ కారు కడిగిన వ్యక్తికి అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. ఈ ఘటన HYDలోని బంజారాహిల్స్లో చోటుచేసుకుంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బంజారాహిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా.. రోడ్డు నంబర్ 12లో ఓ వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో కారును కడుగుతూ కనిపించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జలమండలి ఎండీ.. ఆయనకు జరిమానా విధించారు.