SDPT: బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ వద్ద రాజీవ్ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. కోహెడ మండలానికి చెందిన మైల శంకర్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తు తెలియని కారు అతివేగంగా వచ్చి వెనుక నుండి కొట్టింది.