SKLM: రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ఎమ్మెల్యే శిరీష అన్నారు. మంగళవారం వజ్రపు కొత్తూరు మండలం డోకులపాడు గ్రామంలో ” రైతన్న మీకోసం” కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.