TG: 12,735 గ్రామాలకు గాను 2,176 గ్రామాలే బీసీలకు రిజర్వ్ అయ్యాయి. ఈ లెక్కన 17.08 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, భద్రాద్రి జిల్లాలో 471కి గాను ఒక్కటీ బీసీలకు దక్కలేదు. అత్యధికంగా సిద్ధిపేట జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. గత ఎన్నికల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు దక్కినా.. ఈసారి రొటేషన్ల వల్ల తగ్గినట్లు సమాచారం.