SRCL: రానున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అధికారులు నిస్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)పై వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.