NDL: వీధి కుక్కల పట్ల ప్రజలు, ముఖ్యంగా పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సిరివెళ్ళ డాక్టర్ ముఖేష్ సూచించారు. ఉమ్ము కార్చుతూ.. తలవంచుకుని తిరిగే కుక్కల వల్ల ప్రాణాంతక రేబిస్ వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. కుక్క కరిచిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, నిర్ణీత తేదీల్లో (1, 3, 7, 28) తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.