TG: ఐబొమ్మలో సినిమాలు చూసిన వారందరి డేటా ఇమ్మడి రవి వద్ద ఉందని ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఐదు రోజుల కస్టడీలో ఆయన నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు చెప్పారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు వెళ్లగానే కండీషన్ అగ్రీ చేయాలనే ఆప్షన్ ఉంటుందని.. దానిని క్లిక్ చేయగానే మన ఫోన్లో ఉన్న మొత్తం సమాచారం ఆయనకు వెళ్లిపోతుందని వివరించారు.