కృష్ణా: నందివాడ మండలం లక్ష్మీ నరసింహపురం గ్రామంలో చెరువుల నుండి అక్రమంగా మట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. దళారులు భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతివేగంగా వెళ్లే ట్రాక్టర్ల వల్ల గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొవాలని వారు కోరుతున్నారు.