W.G: జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త విభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టించే SWPC షెడ్లను నిర్వహించాలన్నారు.