KDP: మూడు రోజుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను స్వయంగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చొరవ చూపారు.