ATP: సినీ నటుడు శ్రీకాంత్ మంగళవారం తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆయన తన భార్య ఊహా, కుమారుడు రోషన్తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వీరేష్ స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు.