RR: కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు గ్రామ పంచాయతీ కార్యదర్శిని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ.. ఎల్లమ్మ గుడి వద్ద శుభ్రత పనులు చేపట్టాలని, గ్రామంలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. స్మశాన వాటికలో నీటి కొరత ఉందని వినతిలో పేర్కొన్నట్లు తెలిపారు.