PDPL: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి డా. పీఎం షేక్ ప్రారంభించారు. పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో క్రియాత్మక బోధన ఇవ్వాలని, ప్రేమపూర్వక పలకరింపుతో నేర్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోల్డ్ బల్బీర్ కౌర్లు పాల్గొన్నారు.