ASF: హైదరాబాద్-నాగపూర్ హై స్పీడ్ కారిడార్లో ఆప్షన్-5 ఖరారు చేయాలని NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఆప్షన్-1 వల్ల అత్యవసర పరిస్థితుల్లో 80-120KM అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్షన్-5 అమలు చేస్తే ప్రయాణ సమయం 2-3 గంటలు తగ్గి గిరిజన ప్రాంతం అభివృద్ధి అవుతుందని పేర్కొన్నారు.