PDPL: పెద్దపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. సీఎస్సీ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, జీవో 12 సవరించి సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కాకుండా వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు నిధులను అక్రమంగా బీమా కంపెనీలకు బదిలీ చేశారంటూ నేతలు తీవ్రంగా ఖండించారు.