SRCL: దొంగతనం కేసులో ఓ వ్యక్తికి ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెలువరించినట్టు సిరిసిల్ల సీఐ కృష్ణ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 01, 2025న సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పార్క్ చేసి ఉన్న శీలం బాబు బైకును దుర్మిట్ల నరేష్ ఎత్తుకెళ్లాడన్నారు. దీనిపై బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.