ASF: గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని సిర్పూర్ BJP MLA హరీష్ బాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ ధోత్రేని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని 335 సర్పంచ్ స్థానాలకు గాను కేవలం 20 స్థానాలను మాత్రమే BCలకు కేటాయించారన్నారు. దీనిని సరిదిద్దాలని కలెక్టర్ని కోరామన్నారు.