WGL: వర్షాకాలంలో నీరు నిలవకుండా నాలాల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను ఎప్పటికప్పుడు తొలగించాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం WGL మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేడ్కర్ భవన్ పరిసర ప్రాంతాల్లో జేసీబీలతో జరుగుతున్న సిల్ట్ తొలగింపు పనులను మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో GWMC అధికారులు తదితరులు ఉన్నారు.