కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సీనియర్ IAS మృతిచెందాడు. గౌనహల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో KSMCL MD, సీనియర్ IAS అధికారి మహంతేశ్ బిళగి మరణించారు. ఓ వేడుకకు కారులో వెళ్తుండగా.. కారు డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు మృతిచెందారు. ఈ దుర్ఘటనపై CM సిద్ధరామయ్య, Dy. CM డీకే శివకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.