JN: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాలకుర్తి మండలంలోని 38 గ్రామాలలో రెండవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.