NLG: మహిళలు చిత్తశుద్ధితో ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మహిళల కోసం మహిళలే అండగా నిలబడాలని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసాన్ని ఇస్తుందన్నారు. మహిళలు శక్తివంతంగా ఎదగాలన్నారు.