విజయనగరం మండలం గొల్లలపేట గ్రామంలో జరిగిన “రైతన్న మీకోసం”, “అన్నదాత సుఖీభవ” కార్యక్రమాలలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం రెండు విడతల ప్రయోజనాలను వివరించి, రైతుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతుల ఆర్థిక పురోగతికి సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు పంచ సూత్రాలను అమలు చేస్తున్నారని తెలిపారు.