GDWL: మహిళలు, బాలికల రక్షణపై షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ఎస్సై తేజస్విని పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థినులకు షీ టీమ్స్ విధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈవ్ టీజింగ్, వేధింపులు వంటి సమస్యలు ఎదురైతే సంకోచం లేకుండా వెంటనే 8712670312 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.