NDL: డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం పగడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇవాళ మధ్యాహ్న బడి భోజన పథకంపై సంబంధిత అధికారులతో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు మంచి పోషకాహారాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.