KRNL: గోనెగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని సమస్య లను పరిష్కరించాలని ఇవాళ రాయలసీమ యూత్ స్టూడెంట్ ఫెడరేషన్ మండల అధ్యక్షుడు రాజేష్ నాయుడు MLA బీవీ జయ నాగేశ్వరరెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కళాశాల ఆవరణలో పరిశుభ్రత లేకపోవడంతో, విష సర్పాలు కళాశాలలోకి చొరబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. MLA చొరవ చూపి కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారు.