MBNR: నియోజకవర్గంలోని ఓబ్లాయిపల్లిలో 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషనను మంగళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల బాధలను తీరుస్తూ రూ. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసిందని, సన్న వడ్లకు బోనస్ మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.