CTR: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతుల మంచి కోరే ప్రభుత్వమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. మంగళవారం సాయంత్రం గుడిపాల మండలం బొమ్మ సముద్రం గ్రామంలో నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని తెలిపారు.