AP: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లు విడుదలవుతాయని ప్రకటించారు.