AP: పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో సీఐడీ అధికారులు తన నోటీసులు ఇచ్చారని చెప్పారు. అయినా భయపడేది లేదని.. విచారణను ఎదుర్కొంటానని వెల్లడించారు. తాను ఎలాంటి నేరం చేయలేదన్నారు.