ములుగు జిల్లాకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వరాల జల్లు కురిపించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు గాను 40 ఎకరాల స్థలం కేటాయించేందుకు అనుమతి వచ్చిందన్నారు. వెంటనే స్థలం కేటాయింపునకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.