W.G: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, రవాణా, తూకంలో సమస్యలకు 81216 76653, 1800 425 1291 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశామని, రైతులు వినియోగించుకోవాలని కోరారు.