మెన్స్ T20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ను ICC ఛైర్మన్ జై షా తాజాగా విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కోసం 8 వేదికలను ఎంపిక చేసినట్లు జై షా తెలిపారు. భారత్ నుంచి అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతాతో పాటు శ్రీలంక నుంచి 3 వేదికలను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.