WGL: నర్సంపేట MLA క్యాంపు కార్యాలయంలో ఇవాళ మహిళ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు నర్సంపేట ఆర్డీవో ఉషా రాణి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, సబ్సిడీ గ్యాస్, మరెన్నో సంక్షేమ పథకాలను అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.