TPT: శ్రీకాళహస్తి మండలం జింగిలిపాలెం దళితులకు భూములు పంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో దళితులతో కలిసి ప్రభుత్వ భూమిలో ఎర్ర జెండాలు నాటారు. నారాయణపురం రెవెన్యూలో ఉన్న 15ఎకరాల ప్రభుత్వ భూమిని గత పదిహేనేళ్లుగా దళితులు సాగుచేసుకుంటున్నారని ఆయన తెలిపారు.