బంగాళాఖాతం ప్రాంతంలో భారత్ ‘‘నో-ఫ్లై’’ జోన్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6-8 మధ్య క్షిపణి పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించింది. 1,480 కిలోమీటర్ల వరకు నో-ఫ్లై జోన్ విస్తరించి ఉంది. డిసెంబర్ 6న 12:30 గంటల నుంచి డిసెంబర్ 8న 15:30 గంటల వరకు ఈ నో ఫ్లై జోన్ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.