SRPT: కోదాడ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీరహిత రుణాల పంపిణీ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలపర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. నియోజకవర్గంలోని 2713 సంఘాలకు రూ.2.10 కోట్లు రుణాలు మంజూరు చేసినట్టు ఆర్డీవో సూర్యనారాయణ తెలిపారు.