TG: కాంగ్రెస్ హయాంలో కూల్చివేతలు, పేల్చివేతలు సర్వసాధారణం అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. జమ్మికుంట మండల తనుగుల మానేరునదిపై కూలిపోయిన చెక్ డ్యాంను ఆయన పరిశీలించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాకు పెద్దపీట వేస్తోందన్నారు. ఇసుకాసురులు కావాలనే చెక్ డ్యాంను పేల్చేశారని ధ్వజమెత్తారు.