KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తమరా చెరువు పార్కులోకి వెళ్లే దారిలో మంగళవారం నాగుపాము కలకలం సృష్టించింది. దాదాపు అరగంట పాటు ఆ ప్రాంతంలో పాము తిరగడంతో పార్కుకు వచ్చే వాకర్లు, ప్రజలు భయాందోళన గురయ్యారు. చెత్త కారణంగానే ఈ ప్రాంతం పాములకు నిలయంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.