AP: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా గర్భగుడి దర్శనం చేసుకునే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నవారికే గర్భగుడి దర్శనం లభించేది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం పట్లు డబ్బు చెల్లించలేని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.