NLG: చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు డిసెంబర్ 11న మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 27 నుండి 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. 11న ఉదయం 7 గంటల నుండి ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది. రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.