W.G: మందుగుండు సామాగ్రి తయారీ, నిల్వల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ల తయారీదారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తయారీ లేదా నిల్వలు చేపడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.