KRNL: జిల్లాలో అర్హత ఉన్న పేదలందరికీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ఆదేశించారు. మంగళవారం జరిగిన పీఎం ఉజ్వల యోజన కమిటీ సమావేశంలో, సివిల్ సప్లైస్ అధికారులను అర్హులైన ప్రతి బీపీఎల్ కుటుంబానికి పథకం ద్వారా లబ్ధి చేకూర్చేలా చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.