WGL: సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో SC జనాభా లేకపోయినా 2011 లెక్కల్లో పొరపాటుతో సర్పంచ్ స్థానం SC మహిళకు రిజర్వ్ అయ్యింది. అయితే ఏకైక SC అయిన 60 ఏళ్ల కొంగర మల్లమ్మకు అదృష్టం కలిసొచ్చింది. 1,647 ఓట్లున్న ఈ గ్రామంలో మల్లమ్మ ఇప్పుడు అందరి ఫేవరెట్‌గా మారారు. దీంతో అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం.